Mrunal Thakur | బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న మృణాల్ ఠాకూర్..!
Mrunal Thakur | ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ టాలీవుడ్లో వరుస చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నది. ఇటీవల ‘నాన్న’ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ మూవీలో నటిస్తున్నది.
Mrunal Thakur | ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ టాలీవుడ్లో వరుస చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నది. ఇటీవల ‘నాన్న’ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ మూవీలో నటిస్తున్నది. ఈ చిత్రాన్ని దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 5న థియేటర్లలోకి రానున్నది. ఈ క్రమంలో మృణాల్ ఠాకూర్ హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని దర్శించుకున్నది.
ఎల్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయాన్ని దర్శించిన ఫొటోలును సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. వైరల్‌గా మారాయి. ఏదైనా కొత్త పని, పెద్ద పనులు ప్రారంభించే సమయంలో పూజలు చేయమని.. వీలైతే గుడికి వెళ్లాలని తల్లిదండ్రులు సూచించారని.. అందుకే ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్స్‌కి ముందు ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఫ్యామిలీ స్టార్ చిత్రంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా.. పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు నిర్మిస్తున్నారు. మూవీ టీజర్ ఇటీవల విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మృణాల్ చివరిసారిగా నాని సరసన ‘హాయ్ నాన్న’ చిత్రంలో మెరిసింది. మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం మృణాల్ ‘పూజా మేరి జాన్’ మూవీలోనూ హీరోయిన్గా ఎంపికైంది. ఇక విజయ్ దేవరకొండ చివరిసారిగా లైగర్ చిత్రంలో కనిపించగా.. చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. తాజాగా మరోసారి ‘ఫ్యామిలీ స్టార్’తో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

