అగ్ర హీరో అల్లు అర్జున్ కథానాయకుడిగా, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ భారీ పానిండియా చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘AA22xA6’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సైన్స్ ఫిక్షన్‌తో కూడిన ైస్టెలిష్ డ్రామాగా దర్శకుడు అట్లీ రూపొందిస్తున్నారు. ఇదిలావుంటే.. ఈ సినిమాపై ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో హల్చల్ చేస్తున్నది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతున్నది. దీనికోసం ఓ భారీ సెట్‌ను కూడా నిర్మించారు. ఈ సెట్లో యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్నారట. బన్నీతోపాటు కీలక తారాగణం పాల్గొంటున్న ఈ షూట్లో మృణాళ్ఠాకూర్ ఎంట్రీ ఇచ్చారనేది లేటెస్ట్ న్యూస్.
ఇందులో మృణాళ్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే.. ఈ సినిమా కథ విషయంలో కూడా ఓ ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. ఇది రెండు సమాంతర ప్రపంచాల నేపథ్యంలో సాగే కథట. ఈ రెండు ప్రపంచాలకూ గల సంబంధమేంటి? అనేది ఇందులో ఆసక్తికరమైన అంశం. బన్నీ ఇందులో మల్టిపుల్ క్యారెక్టర్లు చేస్తున్నట్టు గతంలో వార్తలొచ్చాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో ఆయన ద్విపాత్రాభినయం మాత్రమే చేస్తున్నారట. దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో జాన్వీకపూర్, మృణాళ్ ఠాకూర్ కీలక పాత్రధారులు. ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదల తేదీని సంక్రాంతికి ప్రకటించే అవకాశం ఉంది.