Mrunal Thakur Latest Photo shoot | ఏడాది క్రితం విడుదలైన ‘సీతారామం’తో తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంది మరాఠి బ్యూటీ మృణాల్ ఠాకూర్. సీతామహాలక్ష్మీ క్యారెక్టర్లో జీవించింది. సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన మృణాల్ ‘విట్టి దండు’ అనే మరాఠి చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్లో అడపా దడపా సినిమాలు చేస్తూ వచ్చింది. అయితే 2019లో వచ్చిన ‘సూపర్30’ మూవీ హిందీలో మృణాల్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ వస్తుంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ సూపర్ ఫాస్ట్ ఉంటుంది.
ఎక్కడికి వెళ్లిన వాటికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. ఇక ‘సీతారామం’ తర్వాత మృణాల్‌ను అభిమానించే వారి సంఖ్య ఎక్కువైంది. దాంతో ఆమె బోల్డ్ ఫోటోలు షేర్ చేస్తే నెటిజన్లు తెగ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. వీటిపై మృణాల్ ఎన్నోసార్లు స్పందించించి. నా జీవితం నా ఇష్టం.. నాకు నచ్చినట్లు నేనుంటా అంటూ స్టేట్మెంట్లు ఇచ్చింది. అయినా కానీ ఆమెపై ట్రోల్ ఆగట్లేదు. కాగా తాజాగా ఆమె ఫస్ట్‌లుక్ అనే మ్యాగజీన్ కోసం దిగిన ఫోటోలు మరీ బోల్డ్‌గా ఉండటంతో నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. సీత ఇలాగేనా ఉండేది. పద్దతిగా ఉండొచ్చు కదా అంటూ ఆమెపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
ప్రస్తుతం మృణాల్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి అందులో నాని30 ఒకటి. ఇటీవలే షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఫాదర్-డాటర్ సెంటిమెంట్‌తో సాగుతున్న ఈ సినిమాను శౌర్యువ్ అనే యంగ్ దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాను క్రిస్మస్ వీక్ సందర్భంగా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీనితో పాటుగా పూజా మెరీ జాన్, పిప్పా, ఆంఖ్ మిచోలి సినిమాలు చేస్తుంది.