Mrunal Takhur | తెలుగు ప్రేక్షకుల మదిలో సీతా మహాలక్ష్మిగా నిలిచిన మృణాల్ ఠాకూర్, ఇటీవల సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలతో హాట్ టాపిక్ అవుతున్నారు.అక్కినేని సుమంత్‌తో పెళ్లి అంటూ వచ్చిన గాసిప్స్‌కి, ధనుష్‌తో డేటింగ్ అంటూ బాలీవుడ్లో చక్కర్లు కొట్టిన వార్తలకు క్లారిటీ వచ్చినట్లు కనిపించినా… తాజాగా ఆమె పాత వీడియో ఒకటి వెలుగులోకి వచ్చి మళ్లీ చర్చనీయాంశంగా మారింది. “బిపాసా కంటే నేనే అందంగా ఉంటాను” అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. మృణాల్ టీవీ సీరియల్స్‌లో నటిస్తూ కెరీర్ ప్రారంభించిన కాలంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో బిపాసా బసుపై కాస్త ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ఎవరైనా కండలు తిరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే… బిపాసాను చేసుకోండి! నేను బిపాసా కంటే బెటర్‌గా ఉంటాను. ఆడవాళ్లు తనలా నాజుగ్గా ఉండాలని.. బిపాషా మాదిరి కండలు తిరిగిన వారిలా ఉండకూడదని.. ఆమెను చూస్తే మగవారిలా అనిపిస్తుందని మృణాల్ కామెంట్ చేసింది. ఇప్పుడు ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇది చాలా పాతదే అయినా ఇప్పుడు తెరపైకి వచ్చింది.ఈ వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో బిపాసా బసు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ మోటివేషనల్ కోట్ షేర్ చేశారు. బలమైన స్త్రీలు ఒకరికొకరు మద్దతుగా నిలబడాలి.మహిళలు బలంగా కనిపించడం తప్పు కాదు.శారీరక, మానసిక బలం కోసం కండలు అవసరం. పాతకాలపు ఆలోచనలు మార్చండి అనే కొటేషన్ పెట్టింది. నెటిజన్ల అభిప్రాయం ప్రకారం, ఇది మృణాల్ వ్యాఖ్యలకు కౌంటర్ లా ఉందని భావిస్తున్నారు.
బిపాసా, ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రోనాల్డోతో కలిసి ఉన్న వీడియోను కూడా అదే సమయంలో షేర్ చేయడం గమనార్హం. ఇది చూసిన కొంతమంది అభిమానులు.. “తన స్థాయిని చూపించేందుకే ఈ వీడియో పెట్టిందా?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఈ విషయంపై ట్రోల్ నడుస్తున్న క్రమంలో మృణాల్ స్పందించింది. 19 ఏళ్ల వయస్సులో సిల్లీ విషయాల గురించి మాట్లాడాను. అప్పుడు అవి ఎంత బాధిస్తాయో తెలియదు. మెచ్యూరిటీ లేదు.మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నా. ఒకరిని బాధించడం, ఒకరిని ఇబ్బంది పెట్టాలనేది నా ఇంటెన్షన్ కాదు. ఫ్రెండ్స్‌తో చిట్ చాట్ విషయంలో కాస్త హద్దులు దాటి ఇలా జరిగింది. క్షమించండి అని మృణాల్ పేర్కొంది.