Mrunal-Dhanush | సినీ ఇండస్ట్రీలో ఒక పుకారు మొదలైతే అది ఎంత వేగంగా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా అలాంటి ఒక రూమర్ సోషల్ మీడియాను హోరెత్తిస్తోంది. బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ త్వరలో వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు కొన్ని రోజులుగా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వాస్తవానికి వీరిద్దరూ కలిసి పబ్లిక్ ఈవెంట్స్‌లో అరుదుగా మాత్రమే కనిపించారు. అయినా సరే, అదే ఆధారంగా ఇద్దరి మధ్య సన్నిహిత బంధం ఉందంటూ కథనాలు మొదలయ్యాయి. ఇక ఫిబ్రవరి 14న పెళ్లి అంటూ డేట్ కూడా ఫిక్స్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో ఈ రూమర్ మరింత బలపడింది.
ఇందుకు తోడు మృణాల్ సోషల్ మీడియాలో షేర్ చేసే పోస్టులకు తరచూ తమిళ పాటలు జత చేయడం కూడా ఈ ఊహాగానాలకు కారణమైంది. ఆమె తమిళ ఇండస్ట్రీకి దగ్గరవుతోందని, అందుకే ధనుష్‌తో రిలేషన్ ఉందని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానించడంతో విషయం మరింత వైరల్‌గా మారింది. ధనుష్ ఎప్పటిలాగే ఇలాంటి వార్తలపై స్పందించకుండా తన సినిమాలపైనే దృష్టి పెట్టారు. అయితే పెళ్లి వార్తలు హద్దు దాటడంతో మృణాల్ టీమ్ రంగంలోకి దిగింది. తాజాగా ఆమె టీమ్ విడుదల చేసిన ప్రకటనలో ఈ రూమర్స్‌కు పూర్తిగా చెక్ పెట్టింది.
“మృణాల్ – ధనుష్ పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఫిబ్రవరి 14న మృణాల్ వివాహం చేసుకోవడం లేదు. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఒక సినిమా త్వరలో రిలీజ్‌కు సిద్ధమవుతుండగా, మరో సినిమా షూటింగ్లో ఉంది. ఇలాంటి సమయంలో పెళ్లి అన్న వార్తలకు లాజిక్ లేదు. ఆధారాలు లేని పుకార్లను నమ్మవద్దు” అని స్పష్టం చేసింది. అటు ధనుష్‌కు సన్నిహితులు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. ఈ వార్తలు పూర్తిగా ఫేక్ అని, ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేశారు. దీంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పెళ్లి రూమర్స్‌కు అధికారికంగా బ్రేక్ పడినట్టే. మొత్తానికి, అభిమానులను గందరగోళానికి గురిచేసిన ఈ కథనాలన్నీ కేవలం ఊహాగానాలేనని తేలింది. ప్రస్తుతం మృణాల్, ధనుష్ ఇద్దరూ తమ తమ కెరీర్లపై ఫోకస్ పెట్టారని స్పష్టమవుతోంది. ఇక వీరి పెళ్లి గురించి మళ్లీ ఎలాంటి వార్తలు వస్తాయా? లేదా అన్నది కాలమే నిర్ణయించాలి.