Mr. Perfect | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన హిట్ చిత్రాలలో ఒకటి Mr. ఫర్ఫెక్ట్. అప్పటివరకు మాస్ ఇమేజ్‌తో ఉన్న ప్రభాస్‌కు ఒక్కసారిగా లవర్‌బాయ్ ఇమేజ్ను తెచ్చిపెట్టింది. దశరథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజ్ నిర్మించారు. తాప్సీతో పాటు కాజల్ అగర్వల్ కథానాయికలుగా నటించారు.
2011 ఏప్రిల్ 21న విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాను మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా Mr. ఫర్ఫెక్ట్ సినిమాను రీ రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా మూవీ బుకింగ్స్ స్టార్ట్ అయినట్లు తెలిపింది. అయితే ఇప్పటికే ప్రభాస్ బర్త్‌డే కానుకగా ఈశ్వర్‌తో పాటు రెబల్, సలార్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. వీటికి ఇప్పుడు Mr. ఫర్ఫెక్ట్ కూడా తోడు అవ్వడంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగా చేసుకుంటున్నారు.
The #Prabhas we love and the nostalgia we crave are back for a grand celebration! 🔥
Don’t miss the #MrPerfect re-release on October 22nd ❤️🔥
Bookings Open Now :https://t.co/RlpPBiOxEo
Theatres lo Dhol Dhol Dhol Bhale 😎🥁@directordasarad @ThisIsDSP @MsKajalAggarwal @taapsee… pic.twitter.com/hQ2mh6Ufe1
— Sri Venkateswara Creations (@SVC_official) October 16, 2024