‘80, 90s లో జరిగే కథ ఇది. ఇంకా పొయిటిగ్గా చెప్పాలంటే ల్యాండ్‌లైన్స్, క్యాసెట్ రికార్డింగ్ సెంటర్లు, చేతక్ స్కూటర్లు, కుమార్ సాను పాటలు ఇవన్నీ కలిపితే ‘మిస్టర్ బచ్చన్’. ఫస్టాఫ్‌లో చాలా నోస్టాలజిక్ మూమెంట్స్ ఉంటాయి. సెకండాఫ్ అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది’ అన్నారు హరీశ్‌శంకర్. ఆయన దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఆగస్ట్ 15న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం ఈ సినిమా టీజర్‌ని లాంచ్ చేశారు. హరీశ్‌శంకర్ ఇంకా మాట్లాడుతూ ‘ఇందులో బిగ్‌బీ అమితాబ్‌గారిని బేస్ చేసుకొని చాలా మూమెంట్స్ ఉంటాయి. వాటిని తెరపై చూస్తేనే బావుంటుంది. ‘మిరపకాయ్’ కంటే వందశాతం ఎనర్జిటిక్‌గా ఇందులో రవితేజ కనిపిస్తారు. సినిమా చూశాక అభిమానుల అంచనాలు దాటేశామనే నమ్మకం వచ్చింది.’ అని హరీశ్‌శంకర్ చెప్పారు. ఇంకా కథానాయిక భాగ్యశ్రీ బోర్సే, నిర్మాత టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల కూడా మాట్లాడారు.