Mr Bachchan | రవితేజ కథానాయకుడిగా రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘మిస్టర్ బచ్చన్’. హరీశ్‌శంకర్ దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ ప్రమోషన్స్‌ని మేకర్స్ మొదలుపెట్టారు. ఫస్ట్ సింగిల్ ‘సితార్’సాంగ్ ఈ నెల 8న విడుదల కానుంది. మిక్కీ జె.మేయర్ స్వరపరిచిన ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. హరీశ్‌శంకర్, రవితేజ కలయికలో వచ్చిన ‘మిరపకాయ్’ సినిమాలో పాటలు కూడా అప్పట్లో శ్రోతల్ని బాగా అలరించాయి.
ఆ కోవలోనే ‘మిస్టర్ బచ్చన్’ ఆల్బమ్ కూడా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: అయనంక బోస్, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల, సమర్పణ: పనోరమా స్టూడియోస్ అండ్ టి.సీరిస్, నిర్మాణం: పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ.