Mr Bachchan Movie | టాలీవుడ్ కథానాయకుడు రవితేజ, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ‘నామ్ తో సునా హోగా’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్ పోస్టర్లో రవితేజ తన ఫేవరేట్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ పోజ్‌లో కనిపిస్తూ మూవీ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తున్నాడు. ఇదిలావుంటే ఈ సినిమా విడుదల తేదీపై సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ సగానికి పైగా కంప్లీట్ చేసుకోగా.. సినిమా విడుదల తేదీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం మిస్టర్ బచ్చన్‌ను జులైలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై చిత్రయూనిట్ నుంచి ప్రకటన వెలుబడాల్సి ఉంది. మిరపకాయ్ సినిమా తర్వాత రవితేజ, హరీశ్ శంకర్ కాంబోలో ఈ సినిమా వస్తుండడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. రవితేజ ఈ చిత్రంలో అమితాబ్‌బచ్చన్ అభిమానిగా కనిపించనున్నాడు.