Mowgli | ప్రముఖ యాంకర్ సుమ కుమారుడు, యువ హీరో రోషన్ కనకాల తన తదుపరి చిత్రంగా రూపొందుతున్న ‘మోగ్లీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘కలర్ ఫోటో’ ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ద్వారా మంచి హైప్ క్రియేట్ చేసింది. తాజాగా, చిత్ర బృందం ఈ చిత్రానికి విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది.‘మోగ్లీ’ సినిమాను తలైవా రజనీకాంత్ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 12న వరల్డ్ వైడ్ థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు రోషన్, సందీప్ రాజ్, వైవా హర్ష కలిసి ఓ ఫన్నీ వీడియో ద్వారా రిలీజ్ డేట్‌ను లాక్ చేశారు.
“మాస్ కీ, క్లాస్ కీ, యూత్‌కి, ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా బ్లాక్‌బస్టర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం” అని దర్శకుడు సందీప్ రాజ్ పేర్కొన్నారు.ఈ సినిమా కథా నేపథ్యం పూర్తిగా అడవిలో సాగేలా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. లవ్ స్టోరీతో పాటు యాక్షన్ మిక్స్ చేసిన ఈ చిత్రం రోషన్ కెరీర్లో డిఫరెంట్ ప్రాజెక్ట్ అవుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో రోషన్ పోలీస్ యూనిఫామ్‌లో కనిపించడం, అడవిలో ఓ మిస్టీరియస్ బ్యాక్‌డ్రాప్ చూపించడం సినిమాపై క్యూరియాసిటీ పెంచింది.
ఈ చిత్రంలో రోషన్‌కు జోడీగా సాక్షి సాగర్ మడోల్కర్ నటిస్తుండగా, ఇది ఆమె డెబ్యూట్ మూవీ. వైవా హర్ష మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా, మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవ సంగీతం అందిస్తున్నారు.రోషన్ మొదటి సినిమా ‘బబుల్ గమ్’ ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, అతని నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ‘మోగ్లీ’ సినిమాతో సరైన హిట్ కొట్టి, టాలీవుడ్లో తన స్థానాన్ని దృఢం చేసుకోవాలని ఆశిస్తున్నాడు. మొత్తానికి, అడవిలో సాగే ప్రేమ కథా నేపథ్యంలో ‘మోగ్లీ’ సినిమా డిసెంబర్ 12న విడుదల కానుండటంతో, రజనీ బర్త్‌డే నుంచే క్రిస్మస్ వరకు బాక్సాఫీస్‌లో మజా మొదలవబోతోంది!