ప్రస్తుతం హీరో రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలుక’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. మహేశ్‌బాబు.పి దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 28న విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత ఓ కొత్త దర్శకునితో పనిచేసేందుకు రామ్ రెడీ అవుతున్నట్టు సమాచారం. ఆ దర్శకుని పేరు కిశోర్ గోపు. ఆర్కా మీడియాతో కలిసి నటుడు రానా దగ్గుబాటి ఈ సినిమా నిర్మించనున్నట్టు తెలుస్తున్నది. మిస్టిక్ థ్రిల్లర్‌గా, బ్లాక్ మ్యాజిక్, అతీంద్రియ శక్తుల నేపథ్యంలో ఈ సినిమా రూపొందనున్నదని సమాచారం. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్టు ఇన్సైడ్ టాక్.