Mouni Roy | హీరోయిన్ దాంపత్య జీవితంలో చీలికలు .. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విడాకుల ప్రచారం
Mouni Roy | బాలీవుడ్ టెలివిజన్ రంగంలో స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న మౌనీ రాయ్ గత కొన్నేళ్లుగా సినీ రంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
Mouni Roy | బాలీవుడ్ టెలివిజన్ రంగంలో స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న మౌనీ రాయ్ గత కొన్నేళ్లుగా సినీ రంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. టెలివిజన్ సీరియల్స్‌తో కెరీర్ ప్రారంభించిన ఆమె, తర్వాత పలు హిందీ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ‘గోల్డ్’, ‘బ్రహ్మాస్త్ర’, ‘రోమియో అక్బర్ వాల్టర్’ చిత్రాలతో మంచి గుర్తింపు దక్కించుకుంది. అయితే ప్రస్తుతం మౌనీ రాయ్ వ్యక్తిగత జీవితం మళ్లీ వార్తల్లో నిలిచింది. ఆమె తన భర్త సూరజ్ నంబియార్‌తో విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాపిస్తోంది.
మౌనీ రాయ్, సూరజ్ నంబియార్లు కొంతకాలం ప్రేమలో ఉన్న తర్వాత 2022 జనవరి 27న గోవాలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. బెంగాలీ, మలయాళ సంప్రదాయాల ప్రకారం జరిగిన ఈ పెళ్లి అప్పట్లో భారీ చర్చకు దారితీసింది. సినీ ప్రముఖులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇటీవల మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ ఇద్దరూ సామాజిక మాధ్యమాల్లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసినట్లు నెటిజన్లు గుర్తించారు. అంతేకాదు, తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను కూడా ఖాతాల నుంచి తొలగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సాధారణంగా సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన చిన్న మార్పులే పెద్ద చర్చలకు దారి తీస్తుంటాయి. ఈ నేపథ్యంలో మౌనీ చేసిన ఈ పని అభిమానుల్లో అనుమానాలకు కారణమయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో ఈ అంశంపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. “అధికారిక ప్రకటన వచ్చే వరకు నమ్మలేం” అని కొందరు వ్యాఖ్యానిస్తుండగా, “ఇద్దరి మధ్య నిజంగానే ఏదో సమస్య ఉన్నట్టే కనిపిస్తోంది” అంటూ మరికొందరు చర్చిస్తున్నారు. మౌనీ రాయ్ తరచూ తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు పంచుకునేది. అలాంటిది ఆమె ఒక్కసారిగా ఆ జ్ఞాపకాలను తొలగించడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటివరకు మౌనీ రాయ్ లేదా సూరజ్ నంబియార్ ఈ ప్రచారంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో నిజంగానే వారి దాంపత్య జీవితంలో విభేదాలు వచ్చాయా? లేక ఇది కేవలం సామాజిక మాధ్యమాల ఊహాగానమా? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

