Ormax Stars India Loves | ఆర్మాక్స్ అత్యంత ప్రేక్షకాదరణ పొందిన నటీనటుల జాబితాను ప్రకటించింది. ఇందులో టాలీవుడ్ నుంచి ప్రభాస్ మోస్ట్ పాపులర్ నటుడిగా నిలవగా.. హీరోయన్లలో సమంత టాప్‌లో నిలిచింది.
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ప్రతినెల దేశంలోని సెలబ్రిటీల గురించి సర్వే నిర్వహించి.. టాప్ పొజిషన్లో ఉన్న సెలబ్రెటీల జాబితాలను విడుదల చేస్తుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నవంబర్ నెలకు సంబంధించిన మోస్ట్ పాపులర్ మేల్, ఫిమేల్ స్టార్స్ సర్వే జాబితాను ఆర్మాక్స్ వెల్లడించింది. ఈ లిస్ట్‌లో ప్రభాస్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ప్రభాస్ తర్వాత మోస్ట్ పాపులర్ నటులలో తమిళ నటుడు దళపతి విజయ్, అల్లు అర్జున్, షారుక్ ఖాన్, ఎన్టీఆర్, అజిత్ కుమార్, మహేశ్ బాబు, సూర్య, రామ్ చరణ్, అక్షయ్ కుమార్‌లు ఉన్నారు.
Ormax Stars India Loves: Most popular male film stars in India (Nov 2024) #OrmaxSIL pic.twitter.com/n03VKxAyuQ
— Ormax Media (@OrmaxMedia) December 21, 2024
ఇక హీరోయిన్లలో సమంత (Samantha) మొదటి స్థానంలో ఉండగా అలియా భట్ రెండో స్థానంలో ఉంది. వీరి తర్వాత నయనతార, సాయి పల్లవి, దీపికా పదుకొనే, త్రిష, కాజల్ ఆగర్వాల్, రష్మిక మందన్నా, శ్రద్ధా కపూర్, కత్రినా ఖైఫ్ ఉన్నారు.
Ormax Stars India Loves: Most popular female film stars in India (Nov 2024) #OrmaxSIL pic.twitter.com/sMMJANcud8
— Ormax Media (@OrmaxMedia) December 21, 2024