Thammudu | నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తమ్ముడు’. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో అగ్ర నిర్మాత దిల్రాజు తెరకెక్కిస్తున్నారు. సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ కథానాయికలు. జూలై 4న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రచార పర్వాన్ని మొదలుపెట్టారు. ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ పేరుతో సినిమాలోని పాత్రల్ని పరిచయం చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. కథాగమనంలో ఆయా పాత్రలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోను చూస్తే అర్థమవుతున్నది.
చివరిగా నితిన్ లక్ష్యానికి గురిపెట్టి బాణాన్ని సంధించిన తీరు హైలైట్గా నిలిచింది. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్నాథ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గూజ్బంప్స్ తెప్పించేలా ఉంది. లక్ష్య ఛేదనలో ఓ యువకుడి పోరాటం ఏమిటన్నదే ఈ సినిమా కథాంశమని, ఫ్యామిలీ ఎలిమెంట్స్ కలబోసిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇదని మేకర్స్ చెబుతున్నారు. స్వసిక విజయన్, బేబీ శ్రీరామ్ ఆదిత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్, సంగీతం: అజనీష్ లోక్నాథ్, నిర్మాతలు: దిల్రాజు, శిరీష్, రచన-దర్శకత్వం: శ్రీరామ్ వేణు.