Adipurush movie | ఆదిపురుష్ జోరు మొదలైంది. థియేటర్ల వద్ద జన సంద్రోహం కనిపిస్తుంది. దాదాపు రెండు నెలల తర్వాత పెద్ద సినిమా రిలీజవడం. అది కూడా రామాయణం వంటి గొప్ప కథ నేపథ్యంలో సినిమా తెరకెక్కడంతో జనాల్లో ఎక్కడలేని హైప్ నెలకొంది. దానికి తగ్గట్లు ట్రైలర్, పాటలు ఓ రేంజ్లో అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమా బృందం ఆదిపురుష్ ప్రదిర్శితం అయ్యే అన్ని థియేటర్లలో హనుమంతుడి కోసం ఒక సీటును కేటాయించింది. హనుమంతుడు వచ్చి సినిమా చూస్తాడనే నమ్మకంతో ఇలా ఒక సీటు విక్రయించకుండా వదిలేయాలని నిర్ణయించారు.
కాగా తాజాగా ఆదిపురుష్ ప్రదర్శితమువున్న ఓ థియేటర్లోకి వానరం వచ్చింది. అలానే కాసేపు స్క్రీన్ వైపు చూసింది. దాంతో హనుమంతుడి వచ్చి సినిమా చూస్తున్నాడంటూ ఆ థియేటర్లోని ప్రేక్షకులు జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు. ప్రస్తుతం ఆ వానరం సినిమా చూసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. రామాయాణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఓ రౌత్ దర్శకత్వం వహించాడు. ప్రభాస్ రాముడి పాత్ర పోషించగా.. కృతిసనన్ సీతగా కనిపించనుంది. లంకాధిపతి రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కనిపించనున్నాడు. రెట్రో ఫైల్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.
Hanuman watched #Adipurush FDFS. pic.twitter.com/YOtmn0q65M
— LetsCinema (@letscinema) June 16, 2023