Money Heist Continues | ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్పెయిన్ సిరీస్ ‘మనీ హైస్ట్’ (లా కాసా డి పాపెల్) అభిమానులకు నెట్‌ఫ్లిక్స్ తీపి కబురు అందించింది. 2021లో ఐదు సీజన్లతో ఈ ఒరిజినల్ సిరీస్ ముగిసినప్పటికీ, ఈ ఫ్రాంచైజీని మరింత విస్తరించనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా సిరీస్‌కి సంబంధించిన కొత్త టీజర్‌ను విడుదల చేసింది. మనీ హైస్ట్ ప్రపంచం కొనసాగబోతుంది (The world of Money Heist continues) అనే పేరుతో విడుదలైన కొత్త టీజర్ మరింత రసవత్తరంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సిరీస్‌కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించబోతున్నట్లు తెలిపింది.