Monalisa |కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ తన సహజమైన అందంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వైరల్ అయిన యువతి మోనాలిసా ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ ఒక్క వీడియో ఆమె జీవితాన్నే మార్చేసింది. నార్త్‌లోనే కాదు, సౌత్‌లో కూడా మోనాలిసా పేరు ఇప్పుడు బాగా వినిపిస్తోంది.వైరల్ ఫేమ్ తెచ్చిపెట్టిన అవకాశాలతో మోనాలిసా ఇప్పటికే బాలీవుడ్లో ఒక సినిమా చేస్తుండగా, ఇటీవల తెలుగులో కూడా హీరోయిన్గా ఓ సినిమా అధికారికంగా ప్రారంభమైంది. ఇలా వరుసగా సినిమా అవకాశాలు రావడంతో మోనాలిసా కెరీర్ గ్రాఫ్ వేగంగా పైకెగురుతోంది. నటనతో పాటు పబ్లిక్ అప్పియరెన్స్లలోనూ ఆమె క్రేజ్ రోజు రోజుకీ పెరుగుతోంది.
ఇక తాజాగా మోనాలిసా మరో కొత్త పాత్రలో కనిపించింది. హైదరాబాద్‌లోని బేల్ ట్రీ హోటల్‌కు చెందిన అత్యాధునిక సదుపాయాలతో తీర్చిదిద్దిన నూతన కిచెన్ విభాగాన్ని ఆమె ఘనంగా ప్రారంభించింది. ఈ సందర్భంగా మోనాలిసా రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలనతో కిచెన్‌ను ప్రారంభించింది. అంతేకాదు, స్వయంగా కాఫీ తయారు చేసి అతిథులకు అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కిచెన్ ప్రారంభోత్సవం అనంతరం బేల్ ట్రీ హోటల్లోని వివిధ వంటకాలను రుచి చూసిన మోనాలిసా, అక్కడి చెఫ్‌ల పనితీరును, ఫుడ్ క్వాలిటీని ప్రశంసించింది. హోటల్లో అందిస్తున్న ఆహారం, పరిశుభ్రత, ఆధునిక సౌకర్యాలపై ఆమె సంతృప్తి వ్యక్తం చేయడంతో నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు.
మోనాలిసాను ప్రత్యక్షంగా చూడడానికి అభిమానులు, సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సినిమా హీరోయిన్గా మారిన తర్వాత కూడా ఆమెను చూడాలనే ఆసక్తితో జనాలు బాగానే వచ్చారు. ఈ ఈవెంట్ మొత్తం హుషారుగా, సందడిగా సాగింది. ఈ సందర్భంగా బేల్ ట్రీ హోటల్ అధినేత రాజారెడ్డి మాట్లాడుతూ, “బేల్ ట్రీ అంటే తెలుగులో బిల్వ వృక్షం. బిల్వ పత్రం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. శివుడి కృప ఉండాలనే ఉద్దేశంతోనే మా హోటల్‌కు ఆ పేరు పెట్టాం” అని వివరించారు.మొత్తంగా చూస్తే, కుంభమేళా వైరల్ వీడియోతో గుర్తింపు తెచ్చుకున్న మోనాలిసా ఇప్పుడు సినిమాలు, షాప్ ఓపెనింగ్స్, పబ్లిక్ ఈవెంట్స్‌తో ఫుల్ బిజీగా మారింది. రాబోయే రోజుల్లో ఆమె క్రేజ్ ఇంకెంత పెరుగుతుందో చూడాల్సిందే.