Unni Mukundan | మలయాళీ నటుడు ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మార్కో (Marco). హనీఫ్ అదేని (Haneef Adeni) ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. యాక్షన్ జానర్లో ఈ సినిమా వచ్చింది. డిసెంబర్ 20న మలయాళంలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే ఇదే సినిమాను తెలుగులో కూడా విడుదల చేయగా.. మంచి వసుళ్లను రాబట్టింది.
ఇదిలావుంటే ఈ సినిమా ఓటీటీ అనౌన్స్మెంట్ని చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ వేదిక ‘సోనీలివ్’ (SonyLiv)లో వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14 నుంచి స్ట్రీమింగ్ (Marco Ott Release Date) కాబోతున్నట్లు ప్రకటించింది. అయితే చెప్పిన డేట్ కంటే ఒకరోజు ముందుగానే ఈ సినిమాను ఓటీటీలో వదిలింది చిత్రబృందం. ప్రస్తుతం ఈ చిత్రం ‘సోనీలివ్’లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో మార్కో అందుబాటులో ఉంది.
The war has begun! Marco is here!@Iamunnimukundan #ShareefMuhammed #CubesEntertainments #HaneefAdeni #RaviBasrur #KabirDuhanSingh #AbhimanyuShammyThilakan pic.twitter.com/NXTyfoVi6c
— Sony LIV (@SonyLIV) February 13, 2025