Balakrishna 107 | నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీపై అభిమానులే కాదు సినీప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గతంలో మెక్షజ్ఞ కోసం ప్రముఖ రైటర్ సాయి మాధవ్ బుర్ర ఓ కథను సిద్ధం చేశాడని, ఆ కథ బాలకృష్ణకు ఎంతగానో నచ్చిందని వార్తలు వచ్చాయి. అయితే అవన్ని అవాస్తవమేనని తెలిశాయి. తర్వాత కొన్ని రోజలకు బాలకృష్ణకు ‘పైసా వసూల్’ వంటి హిట్ ఇచ్చిన పూరీ దర్శకత్వంలో మోక్షజ్ణ ఎంట్రీ ఉండబోతుంది అని ప్రచారం సాగింది. అది కూడా వట్టి పుకారు గానే మిగిలిపోయింది. అయితే తాజాగా మోక్షజ్ఞ, బాలకృష్ణ సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.
బాలకృష్ణ ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ యాక్షన్ సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు విశేష స్పందన వచ్చింది. ‘క్రాక్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత గోపిచంద్ మలినేని ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో నందమూరీ అభిమానులతో పాటు ప్రేక్షకులలో కూడా ఎంతగానో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో తాజాగా మోక్షజ్ఞ గత రాత్రి చేసిన ట్వీట్ నెట్టంట వైరల్‌గా మారింది. మోక్షజ్ఞ తన ట్విట్టర్లో ‘నైట్ షూట్ #NBK107’ అని ట్వీట్ చేశాడు. మోక్షజ్ఞ చేసిన ఈ ట్వీట్ సినీపరిశ్రమలో మరో చర్చకు దారి తీసింది. బాలకృష్ణ సినిమాతో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వనున్నాడా? అంటూ నెటీజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే నిజంగానే బాలకృష్ణతో కలిసి నటిస్తున్నాడా? లేదా షూటింగ్ చూద్దామని వచ్చాడా? అనేది తెలియాల్సి ఉంది.