Bollywood Director Mohit Suri | బాలీవుడ్ స్టార్ దర్శకుడు మోహిత్ సూరి అంటే ప్రస్తుతం ఉన్న జెంజీ (Zenzi) జనరేషన్‌కి తెలియదేమో కానీ ఒకప్పుడు అతడి సినిమాలు వస్తున్నాయంటే బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు సౌత్ ప్రేక్షకులు కూడా తెగ ఎదురుచూసేవారు. మెహిత్ దర్శకత్వంలో వచ్చిన ఆషికి 2, వో లమ్హే, అవరాపన్, ఏక్ విలన్, హమారీ అధురి కహానీ వంటి చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్ సూపర్ హిట్‌గా నిలిచాయి. 2013లో వచ్చిన ఆషికి 2 అయితే బాలీవుడ్లో ఆల్ టైం క్లాసిక్‌లలో ఒకటిగా నిలిచింది. ఇందులోని తుమ్ హి హో పాటతో పాటు ఇతర పాటలు చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. అయితే మోహిత్ సూరి దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం సైయారా. ఆహాన్ పాండే, అనిత్ పడ్డా అనే ఇద్దరూ కొత్త నటినటులతో ఈ సినిమాను తెరకెక్కించాడు మోహిత్. ఈ చిత్రం గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇటీవల ఒక పోస్ట్ పెట్టాడు. తాజాగా ఈ విషయంపై మోహిత్ స్పందిస్తూ.. తాను యానిమల్ చూసి సందీప్‌కి పెద్ద ఫ్యాన్ అయ్యానని చెప్పుకోచ్చాడు.
నాకు సందీప్ గురించి అంతగా తెలియదు. కానీ యానిమల్ సినిమా చూసి నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. అయితే ఆ సినిమాకు వచ్చిన నెగిటివిటీ వలన పోస్ట్‌ను డిలీట్ చేశాను. కానీ ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. అయితే నా సినిమా వస్తుందని తెలిసి అతడు నేను ఎవరో తెలియకుండా ప్రమోట్ చేశాడు. నేను ఇప్పుడు సందీప్‌ను క్షమాపణలు కోరుతున్నాను. అలాగే యానిమల్ సినిమాను బహిరంగంగా ప్రశంసించాలని అనుకుంటున్నాను అంటూ మోహిత్ చెప్పుకోచ్చాడు.
#Saiyaara director #MohitSuri on #Animal
“I loved it immensely. I texted Sandeep back then when many were hating on it but couldn’t express it publicly since I left social media. I APOLOGISE. I wish I’d praised it publicly. I AM A #SandeepReddyVanga FAN.”pic.twitter.com/wUOi0SWqhh
— Raymond. (@rayfilm) July 19, 2025