మలయాళ అగ్ర నటుడు మోహన్‌లాల్ ప్రస్తుతం బ్లాక్‌బస్టర్ విజయాలతో దూసుకుపోతున్నారు. తెలుగు చిత్రం ‘కన్నప్ప’లో ఆయన కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. మంచు విష్ణు టైటిల్ రోల్లో భక్తిరస ప్రధానంగా రూపొందిస్తున్న ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. బుధవారం మోహన్‌లాల్ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్రబృందం కొత్త గ్లింప్స్‌ను విడుదల చేసింది.
ఈ సినిమాలో మోహన్‌లాల్ దైవిక శక్తులు కలిగిన కిరాత అనే పాత్రను పోషిస్తున్నారని, కథాగమనంలో ఆయన పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని చిత్రబృందం వెల్లడించింది. ‘కన్నప్ప’ చిత్రంలో మోహన్‌లాల్‌తో పాటు మోహన్‌బాబు, అక్షయ్‌కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ వంటి అగ్రతారలు భాగమవుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.