Mohanlal | మాలీవుడ్ సీనియర్ యాక్టర్ సిద్దిఖీ తనను ట్రాప్ చేసి రేప్ చేశాడంటూ మలయాళ నటి రేవతి సంపత్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ సర్కిల్లో దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (Association of Malayalam Movie Artists)కు జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్న సిద్ధిఖీ తన పదవికి రాజీనామా కూడా చేసిన..లేఖను ప్రెసిడెంట్ మోహన్ లాల్‌కు (Mohanlal) అందజేశాడు.
తనపై వచ్చిన ఆరోపణల కారణంగానే తాను ఈ పదవి నుంచి వైదొలుగుతున్నానని చెప్పాడు. తాజాగా ఈ వ్యవహారంలో ప్రెసిడెంట్ మోహన్‌లాల్‌తోపాటు ఎగ్జిక్యూటివ్ కమిటీనీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కమిటీ సభ్యుల్లో కొందరిపై వస్తోన్న ఆరోపణల నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ AMMA ఎగ్జిక్యూటివ్ కమిటీని రద్దు చేయాలని నిర్ణయించాం.
మరో రెండు నెలల్లో ఎన్నికలు నిర్వహించిన అనంతరం కొత్త కమిటీ ఏర్పాటవుతుందని అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. కొత్త నాయకత్వంలో అసోసియేషన్ పునరుద్దరణ, బలపడుతుంది. మా తప్పిదాలను గుర్తించిన ప్రతీ ఒక్కరికి తాము ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు పేర్కొంది. ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ కమిటీలో జగదీష్, సూరజ్ వెంజరమూడు, టొవినో థామస్ లాంటి పాపులర్ యాక్టర్లున్నారు.
రేవతి సంపత్ చేసిన వ్యాఖ్యలపై సిద్ధిఖీ ఇప్పటికే కేరళ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రేవతి సంపత్ తనపై తప్పుడు ఆరోపణలను చేస్తుందని.. కావాలని తన పరువు, మర్యాదలకు భంగం కలిగిస్తుందని.. ఆమె కుట్రలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కేరళ డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
జస్టిస్ హేమ కమిటీ నివేదిక :
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలకు వేధింపులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. ఆ అంశాన్ని స్టడీ చేసేందుకు కేరళ సర్కారు హేమా కమిషన్‌ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్ హైకోర్టు జడ్జి కే హేమా ఆ కమిషన్‌కు నాయకత్వం వహించారు. నటి శారదతోపాటు మాజీ సివిల్ సర్వీస్ అఫిషియల్ కేబీ వాత్సల కుమారి ఆ కమిషన్‌లో సభ్యులుగా ఉన్నారు. ఆ కమిషన్ ఇటీవలే తన నివేదికను సీఎం విజయన్‌కు సమర్పించింది.
మలయాళ చిత్రం పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై జస్టిస్ హేమ కమిటీ నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది. ఇండస్ట్రీలో మహిళా ప్రొఫెషనల్స్ లైంగిక వేధింపులు, దోపిడీకి గురవుతున్నారని .. అమానవీయ ప్రవర్తనకు బాధితులుగా ఉన్నారని తెలిపింది.
ఇండస్ట్రీని కొంత మందితో కూడిన ఒక ‘క్రిమినల్ గ్యాంగ్’ నియంత్రిస్తున్నదని పేర్కొన్న కమిటీ.. లొంగని మహిళలను ఇండస్ట్రీ నుంచి బయటకు పంపేస్తారని వెల్లడించింది. కొంత మంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, నటులు, ప్రొడక్షన్ కంట్రోలర్స్ మధ్య ఒప్పందం ఉన్నదని కమిటీ నివేదిక ఆరోపించింది. 2017లో ఓ నటిపై దాడి కేసు తర్వాత ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది.
Devara | దేవర మ్యాడ్నెస్.. డిఫరెంట్ షేడ్స్‌లో తారక్ నయా లుక్ అదిరిందంతే..!
Lal Salaam | సస్పెన్స్ వీడింది.. ఫైనల్‌గా ఓటీటీలోకి రజినీకాంత్ లాల్ సలామ్..!
Sikandar | సల్మాన్ ఖాన్ సికిందర్ మారథాన్ షెడ్యూల్ షురూ.. ఎక్కడంటే..?
Game Changer | ఫైనల్‌గా రాంచరణ్ గేమ్‌ఛేంజర్ విడుదల తేదీపై క్లారిటీ.. ఎప్పుడో తెలుసా..?