Malaikottai Valiban | ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal). ఈ స్టార్ యాక్టర్ నటిస్తున్న సినిమాల్లో ఒకటి మలైకోటై వాలిబన్ (Malaikottai Valiban). లిజో జోష్ పెల్లిస్సెరీ డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ అందించింది మోహన్ లాల్ టీం. మలైకోటై వాలిబన్ షూటింగ్ పూర్తి చేసింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా షూటింగ్కు ప్యాకప్ చెబుతూ పార్టీ చేసుకున్నారు మోహన్ లాల్ అండ్ డైరెక్టర్ టీం.
హ్యాపీ మూడ్లో చిల్ అవుట్ అవుతున్న ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన ప్రీ లుక్, ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుండగా.. విడుదల తేదీపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్లు విద్యుత్ జమ్వాల్, రాధికా ఆప్టే, సోనాలీ కులకర్ణి, డానిష్ సేత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని మ్యాక్స్ ల్యాబ్స్-సెంచురీ ఫిలిమ్స్ బ్యానర్లపై జాన్-మేరీ క్రియేటివ్ తెరకెక్కిస్తున్నారు. మోహన్ లాల్ ఆరు పదుల వయస్సులోనూ కండలు తిరిగిన దేహంతో కనిపిస్తున్న మలైకోటై వాలిబన్ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. మోహన్ లాల్ మరోవైపు Ram: Part 1తోపాటు మరో రెండు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.
పార్టీ మూడ్లో ఇలా..
#MohanLal‘s much awaited #MalaikottaiVaaliban has been wrapped up. Here are some clicks from packup party ✨📸@Mohanlal @mrinvicible @shibu_babyjohn #Kochumon #Johnandmarycreative #Maxlab #CenturyFilms @propratheesh @baraju_SuperHit #MohanlalWithLJP pic.twitter.com/xAHLSx3onM
— BA Raju’s Team (@baraju_SuperHit) June 18, 2023