International Yoga Day | యోగా విశిష్టతను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు ఐక్యరాజ్య సమితి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day)గా ప్రకటించిందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నేడు అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని శారీరక, మానసిక, ఇతర అనారోగ్య రుగ్మతలను దూరం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించే యోగా ప్రాముఖ్యతను చాటి చెప్పేలా దేశవ్యాప్తంగా సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలు యోగాసన ప్రక్రియలో పాల్గొంటున్నారు.
సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు వివిధ రకాల యోగాసనాలు వేస్తూ.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. అభిమానులు, ఫాలోవర్లు, నెటిజన్లకు సందేశాలు పంపిస్తున్నారు. మోహన్‌లాల్ (Mohanlal), అల్లు అర్జున్ (Allu arjun), పూజాహెగ్డే, అల్లు అర్హ, కీర్తిసురేశ్, కృతిసనన్, సమంత, రకుల్ ప్రీత్ సింగ్, సోహా అలీఖాన్, నేహా దూపియా, వరుణ్ ధవన్, శిల్పాశెట్టి, తమన్నా ఇతర సెలబ్రిటీలకు సంబంధించిన స్టిల్స్ కొన్ని నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
స్వీయ ప్రయాణం.. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అని క్యాప్షన్ ఇచ్చింది కీర్తిసురేశ్.