Mohanlal | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ కాంబినేషన్లలో ఒకటి మోహన్‌లాల్ (Mohanlal) -జీతూ జోసెఫ్ (Jeethu Joseph). ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన దృశ్యం 1, దృశ్యం 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లా్క్ బస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. తాజాగా ఈ ఇద్దరి కలయికలో మరో సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. లేటెస్ట్ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ నంబర్ 33గా రాబోతుంది. అయితే ఈ చిత్రం దృశ్యం ప్రాంఛైజీనా..? లేదంటే రామ్ ప్రాంఛైజీనా..? అనే దానిపై మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించింది. మోహన్ లాల్ నటిస్తోన్న రామ్.. పార్ట్-1 షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానున్నట్టు సమాచారం. అంతేకాదు ఈ మూవీ షూటింగ్ కొచీ, త్రివేండ్రమ్ ప్రాంతాల్లో నిర్వహించనున్నారట. దీనిపై మోహన్ లాల్ టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మోహన్ లాల్ ఇప్పటికే పాన్ ఇండియా కథాంశంతో వృషభ (VRUSHABHA) సినిమా చేస్తున్నాడని తెలిసిందే. టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ (Roshann Meka) ఈ చిత్రంలో మోహన్ లాల్ కొడుకు పాత్రలో కనిపించబోతున్నాడు.
వృషభ తెలుగు, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది. బాలాజీ టెలీఫిలిమ్స్, కనెక్ట్ మీడియా, ఏవీస్ స్టూడియోస్ బ్యానర్లపై ఏక్తాకపూర్, వరుణ్ మథుర్, అభిషేక్ వ్యాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మోహన్ లాల్ మరోవైపు పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న మలైకోటై వాలిబన్ నటిస్తున్నాడు.
లిజో జోష్ పెల్లిస్సెరీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ విద్యుత్ జమ్వాల్, రాధికా ఆప్టే, సోనాలీ కులకర్ణి, డానిష్ సేత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యాక్స్ ల్యాబ్స్-సెంచురీ ఫిలిమ్స్ బ్యానర్లపై జాన్-మేరీ క్రియేటివ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
Requesting all your prayers and support.@Mohanlal | @JeethuJosephDir | @antonypbvr | @aashirvadcine | #ProductionNo33 pic.twitter.com/KIQVPzjNoM
— Aashirvad Cinemas (@aashirvadcine) July 13, 2023