Vrusshabha | మలయాళం సూపర్ స్టార్ మోహన్‌లాల్ వరుస సినిమాలతో దూసుకపోతున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది ఎల్2 ఎంపురాన్, తుడరుమ్, కన్నప్ప, హృదయపూర్వం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లల్లెట్టన్ తాజాగా మరో సినిమాను ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘వృషభ’. ఈ సినిమాకు నంద కిషోర్ దర్శకత్వం వహిస్తుండగా.. కనెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్. వ్యాస్ స్టూడియోస్, ఆశీర్వాద్ సినిమాస్ సమర్పిస్తున్నాయి. శోభా కపూర్, ఏక్తా ఆర్. కపూర్, సి.కె. పద్మకుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్. వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జుహి పరేఖ్ మెహతా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియాగా రాబోతున్న ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్రబృందం మొదట ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విడుదల తేదీని వాయిదా వేస్తూ.. కొత్త విడుదల తేదీని ప్రకటించింది. ఈ సినిమాను నవంబర్ 06న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది. ఈ మూవీలో మోహన్‌లాల్ యోధుడి పాత్రలో కనిపించనున్నారు.
MOHANLAL – ‘VRUSSHABHA’ GETS A NEW RELEASE DATE: 6 NOV 2025… #Vrusshabha – starring #Mohanlal [@Mohanlal] in the central role – is now set for a worldwide release on [Thursday] 6 Nov 2025.
Shot simultaneously in #Malayalam and #Telugu, the film will also release in #Hindi and… pic.twitter.com/j5E3DJM2KN
— taran adarsh (@taran_adarsh) October 9, 2025