Lucifer 2 Empuraan Trailer | మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohan Lal) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఎల్2 ఎంపురాన్(L2 Empuraan). బ్లాక్ బస్టర్ చిత్రం లుసిఫర్ (Lucifer) సినిమాకి ఈ చిత్రం సీక్వెల్‌గా వస్తుంది. నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మంజు వారియర్ (Manju Warrier), టోవినో థామస్(Tovino Thomas) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
స్టీఫెన్ నెడుంపల్లి(మోహన్ లాల్)గా ఉండి ఒక సాధారణ జీవితం గడుపుతున్న ఇతడు అసలు ఖురేషీ అబ్రాహం అనే అండల్ వరల్డ్ డాన్‌గా ఎలా ఎదిగాడు అనే కథతో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. మలయాళంతో పాటు, తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే.. పృథ్విరాజ్‌కు దర్శకుడిగా ఇది మూడో సినిమా. మూడు సినిమాల్లో మోహన్‌లాల్ ప్రధాన హీరోగా ఉండటం విశేషం.