ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ చిత్రంలో నటిస్తున్నారు మంచు విష్ణు. ఆయన కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. నేడు మంచు విష్ణు జన్మదినం. ఈ సందర్భంగా ‘కన్నప్ప’ టీమ్ ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసింది. ‘కన్నప్ప’ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం గ్రాఫిక్ వర్క్ జరుగుతున్నది. శ్రీకాళహస్థి స్థలపురాణం ఆధారంగా ‘కన్నప్ప’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో శివుడి పరమభక్తుడిగా మంచు విష్ణు ఇంటెన్స్ రోల్‌ను పోషిస్తున్నారు. అధికభాగం న్యూజిలాండ్‌లోని సుందరమైన లొకేషన్లలో చిత్రీకరణ జరిపారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్, అక్షయ్‌కు మార్, ప్రభాస్, శరత్‌కుమార్ వంటి అగ్ర తారలు భాగమవుతున్నారు. ఆద్యాత్మిక, భక్తి ప్రధాన అంశాలతో ఈ సినిమా ఆకట్టుకుంటుందని, విజువల్ వండర్‌గా ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుందని చిత్రబృందం పేర్కొంది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.