
ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు బాగున్నాయని సీనియర్ నటుడు మోహన్‌బాబు ప్రశంసించారు. ఆయన తనయుడు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా విజయం సాధించిన సందర్భంగా సోమవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మోహన్‌బాబు మాట్లాడారు. సినీ ఇండస్ట్రీ ఉభయ తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రుల సహకారం తీసుకుంటేనే ముందుకు పోతుందన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులను కలిసి సమస్యలను విన్నవించుకుంటే వారు ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తారనే ఆశాభావం వ్యక్తంచేశారు. నటీనటులు ఏ రోజు తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులను సన్మానించలేదన్నారు. భవిష్యత్తులో ‘మా’ అసోసియేషన్ ఆ పని చేయాలని సూచించారు.