Mitra Mandali | టాలీవుడ్ నటుడు ప్రియదర్శి మరో కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గీతా ఆర్ట్స్ 2 బాధ్యతల నుంచి విరామం తీసుకున్న నిర్మాత బన్నీ వాస్, తన సొంత బ్యానర్ బన్నీ వాస్ వర్క్స్‌ని ప్రారంభించి, దానిలో మొదటి సినిమాగా ఒక కొత్త ఎంటర్టైనర్ను నిర్మించబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మిత్రమండలి అంటూ ఈ సినిమాను తెరకెక్కించబోతుండగా.. బన్నీ వాసు ఈ సినిమాను సమర్పిస్తున్నారు. సప్త అశ్వ మీడియా వర్క్స్ మరియు వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ప్రియదర్శి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో సోషల్ మీడియా ఇన్‌ప్లుయెన్సర్ నిహారిక NM కథానాయికగా నటించబోతుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాతో ఎస్ విజయేంద్ర దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించబోతున్నాడు. ఈ సినిమా బ్యాండ్ ట్రూప్ నేపథ్యంలో రాబోతున్నట్లు తెలుస్తుంది.
The masks are off, and here’s the #MithraMandali that’ll bring you a new Madness & Entertainment 👬👬👧
Motion Poster: https://t.co/OXCGyZoSuC@BVWorksOffl @saptaaswamedia @VyraEnts #VijayendarS @PriyadarshiPN @JustNiharikaNm @smayurk @IamVishnuOi #PrasadBehra @Bhanu_pratapa… pic.twitter.com/EDdAKPuMSn
— Bunny Vas (@TheBunnyVas) June 6, 2025