ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మిత్రమండలి’. విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బన్నీ వాసు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి ‘స్వేచ్ఛ స్టాండు..’ అనే గీతాన్ని విడుదల చేశారు. ఆర్.ఆర్.ధృవన్ స్వరపరచిన ఈ పాటకు విజయేందర్ ఎస్, ఆర్.ధృవన్ సాహిత్యం అందించారు. ‘వై దిస్ కొలవెరి..’ పాట శైలిలో ఈ గీతం సాగింది.
నేటి యువతరం నచ్చే ట్రెండీ సాంగ్ ఇదని, స్నేహం ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, ఆద్యంతం హాస్యంతో ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు. వెన్నెల కిషోర్, సత్య, వీటీవీ గణేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఆర్.ఆర్.ధృవన్, నిర్మాతలు: కల్యాణ్ మంతెన, భానుప్రతాప, విజయేందర్ రెడ్డి తీగల, దర్శకత్వం: విజయేందర్ ఎస్.