ప్రియదర్శి, నిహారిక ఎన్ఎం, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ముఖ్య తారలుగా రూపొందిన వినోదభరిత చిత్రం ‘మిత్ర మండలి’. విజయేందర్.ఎస్ దర్శకుడు. కల్యాణ్ మంతిన, భాను ప్రతాప, డాక్టర్ విజయేందర్‌రెడ్డి తీగల నిర్మాతలు. ఈ నెల 16న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ సినిమాపై అంచనాలు పెంచాయని మేకర్స్ చెబుతున్నారు. ప్రమోషన్లో భాగంగా విజయవాడలో ఓ ఈవెంట్‌ని నిర్వహించారు.
చిత్ర సమర్పకుడు బన్నీవాస్, నిర్మాత భాను ప్రతాప, హీరోహీరోయిన్లు ప్రియదర్శి, నిహారిక ఎన్ఎం లతోపాటు ఆర్.ఆర్. ధ్రువన్, నటులు ప్రసాద్ బెహరా, విష్ణు ఓయి ఈ ఈవెంట్లో సందడి చేశారు. ఈ చిత్రానికి కెమెరా: సిద్దార్థ్ ఎస్.జె, సహనిర్మాత: సోమరాజు పెన్మెత్స, సమర్పణ: బివి వర్క్స్ బ్యానర్, బన్నీవాస్, నిర్మాణం: సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటైర్టెన్మెంట్స్.