ప్రియదర్శి, నిహారిక ఎన్ఎం జంటగా నటించిన సెటైరికల్ కామెడీ ఎంటర్టైనర్ ‘మిత్రమండలి’. విజయేందర్ దర్శకుడు. కల్యాణ్ మంథెన, భాను ప్రతాప, డా.విజేందర్‌రెడ్డి తీగల నిర్మాతలు. బన్నీవాస్ సమర్పకుడు. ఈ నెల 16న సినిమా విడుదల కానున్నది. ఈ క్రమంలో సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.
ఈ సందర్భంగా చిత్రబృందం శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘సెన్సార్‌వారు యు/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. సినిమా వినోదభరితంగా ఉన్నదని, సమాజంలోని కొన్ని వ్యవస్థలపై సున్నితంగా విమర్శనాస్ర్తాలు సంధించారని కొనియాడారు. బడ్డీ కామెడీ యాంగిల్లో చూపిస్తూనే మంచి సెటైరికల్‌గా తీశారని మెచ్చుకున్నారు.’
అని చిత్రబృందం ప్రకటనలో పేర్కొన్నది. విష్ణు ఓయి, రాగ్‌మయూర్, ప్రసాద్ బెహరా, వెన్నెల కిశోర్, సత్య, వీటీవీ గణేశ్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: సిద్ధార్థ్ ఎస్‌జె, సంగీతం: ఆర్.ఆర్.ధ్రువన్, సమర్పణ: బి.వి.వర్క్స్ బ్యానర్, బన్నీవాస్, నిర్మాణం: సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటైర్టెన్మెంట్స్.