Mister mummy movie| నిజజీవిత భార్యాభర్తలు సినిమాలో భార్యాభర్తలుగా నటిస్తే ఎలా ఉంటుందో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు జెనీలియా,రితేష్‌దేశ్‌ముఖ్. వీళ్లిద్దరూ కలిసి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్ మమ్మి. షాద్ అలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీ-సిరీస్ బ్యానర్‌పై భూషన్‌కుమార్, కృష్ణ కుమార్, షాద్అలి ,శివ ఆనంత్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హాస్యాస్పదంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో పూర్తి స్థాయి వినోదం ఉంటుందని..అందరు కడుపుబ్బా నవ్వుకుంటారని చిత్ర బృందం తెలిపింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదలచేశారు. ఈ పోస్టర్లో జెనీలియతో పాటు రితేష్ కూడా కడుపుతో ఉండటం ఆసక్తిరేకెత్తిస్తుంది. చాలా రోజుల తర్వాత కలిసి నటిస్తున్న ఈ జంట వెండి తెరపై ఏ విధంగా ఆకట్టకుంటారో చూడాలి. త్వరలోనే ఈ చిత్ర టీజర్ ను విడుదల చేసి ఎలాగైనా ఈ ఏడాది ద్వితియార్థంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట.