Mister Idiot | రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ ఇడియట్’. గౌరీ రోణంకి దర్శకురాలు. జేజే ఆర్ రవిచంద్ నిర్మిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం ఈ సినిమా నుంచి ‘వస్సాహి వస్సాహి..’ అనే పాటను నటుడు శివాజీ విడుదల చేశారు. సంస్కృతంలో రాసిన ఈ పాట అద్భుతంగా ఉందని ఆయన ప్రశంసించారు.
అనూప్ రూబెన్స్ స్వరపరచిన ఈ పాటకు శివశక్తిదత్తా సాహిత్యాన్ని అందించారు. రామచంద్ర ఆలపించారు. ‘సౌందర్య సార, మకరంద ధార, శృంగార పారవరా..వస్సాహి వస్సాహి’ అంటూ ఈ పాట సంస్కృతంలో సాగింది. ఈ చిత్రానికి కెమెరా: రామ్‌రెడ్డి, సంగీతం: అనూప్‌రూబెన్స్.