నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా నటిస్తున్న చిత్రానికి ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. పి.మహేష్ బాబు దర్శకుడు. ఈ చిత్రంలో చెఫ్ అన్విత రవళి పాత్రలో అనుష్క కనిపించనుంది. సిద్ధు పోలిశెట్టి అనే స్టాండప్ కమెడియన్గా నవీన్ పోలిశెట్టి నటిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా వేసవి విడుదలకు సిద్ధమవుతున్నది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా తెరపైకి రానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : నీరవ్ షా, సంగీతం : రధన్.