Don Bosco | ‘జైలర్’ ‘నాసామి రంగ’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది మలయాళీ భామ మిర్నా మీనన్. ఆమె నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘డాన్ బాస్కో’. రుష్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి పి.శంకర్ గౌరి దర్శకుడు. శైలేష్ రమ నిర్మాత. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ఈ సినిమాలో మిర్నామీనన్ పాత్ర కథాగమనంలో కీలకంగా ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది.
‘పాఠశాల మిత్రుల రీయూనియన్ నేపథ్యంలో సాగే కథ ఇది. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. వినోదంతో పాటు భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి’ అని మేకర్స్ తెలిపారు. మౌనిక, మురళీశర్మ, విష్ణు ఓయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎదురోలు రాజు, సంగీతం: మార్క్ కె రాబిన్, దర్శకత్వం: పి.శంకర్ గౌరి.