‘హను-మాన్’ఫేం తేజ సజ్జా సూపర్ యోధాగా నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ అడ్వెంచర్ ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్‌లో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ‘జరగబోయేది మారణహోమం. శిధిలం కాబోతోంది అశోకుడి ఆశయం.. కలియుగంలో పుట్టిన ఏ శక్తీ దీన్ని ఆపలేదు..’ అనే సాధువు వాయిస్‌తో టీజర్ మొదలైంది.
ది బ్లాక్ స్కార్డ్గా మంచు మనోజ్, సూపర్యోధగా తేజ సజ్జా ఎంట్రీలు ఈ టీజర్లో హైలైట్స్. ఓ వినాశనాన్ని ఆపేందుకు విధి నుంచి ఉద్భవించిన యోధుని కథగా ఈ సినిమా ఉండబోతున్నదని టీజర్ చెబుతున్నది. ఫాంటసీ విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయిక. ఈ చిత్రానికి రచన: మణిబాబు కరణం, సంగీతం: గౌరహరి, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల.