Mirai Day 1 Collections | తేజ సజ్జ నటించిన ‘మిరాయ్’ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను సాధించినట్లు తెలుస్తుంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ సినిమా తొలిరోజు దేశవ్యాప్తంగా రూ. 12 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. దీంతో హనుమాన్ సినిమా మీద ఉన్న రికార్డులను మిరాయ్ బద్దలుకొట్టింది. ‘హనుమాన్’ తొలిరోజు రూ. 8 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా.. ‘మిరాయ్’ ఆ రికార్డును సులభంగా అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటి రోజు రూ.12 కోట్ల నెట్ వసూళ్లను సాధించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో రూ. 6 కోట్లకు పైగా ($700k+) వసూలు చేసిందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై సుమారు రూ. 60 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ‘మిరాయ్’ సినిమాకు విజువల్స్, కథ, మరియు నటీనటుల నటనకు మంచి స్పందన రావడంతో, వారాంతంలో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.