మన సంస్కృతిని చాటిన చిత్రమిది
ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘బలగం’. ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్‌పై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించారు.
ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘బలగం’. ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్‌పై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించారు. వేణు యెల్దండి దర్శకత్వం వహించారు. సోమవారం ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనను వీక్షించారు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆయన మాట్లాడుతూ…‘వెస్ట్రన్ కల్చర్ మనల్ని చుట్టుకుంటున్న నేపథ్యంలో మన సంస్కృతీ సంప్రదాయాలను తెరపై ఆవిష్కరించి చూపించిన సినిమా ఇది. మన గ్రామాల్లో ఉండే వాతావరణాన్ని ప్రతిబింబించింది. కొమురయ్య అనే పాత్ర చుట్టూ కుటుంబ భావోద్వేగాలతో కథను అల్లుకున్న తీరు ఆకట్టుకుంటుంది. వాళ్ల పిల్లలతో ఇంత మంచి సినిమా నిర్మింపజేసిన దిల్ రాజుకు అభినందనలు. హాస్యనటుడిగా మంచి పేరు తెచ్చుకున్న వేణు దర్శకుడిగా తన తొలి చిత్రంతో మంచి ప్రయత్నం చేశాడు. పాత్రలు, సన్నివేశాలు అన్నీ మన గ్రామసీమల్లో సహజంగా చూసినట్లు అనిపించాయి. పాటలు, ఫైట్స్ ఉన్న కమర్షియల్ సినిమాలు ఎన్నో వస్తాయి కానీ ఇలాంటి చిత్రాలు తెరకెక్కడం అరుదు. కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబం ఎలా బాధపడుతుంది. ఎన్ని విబేధాలు ఉన్నా…ఇబ్బందికర పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు ఎలా ఒక్కటవుతారు అనేది హృదయానికి హత్తుకునేలా రూపొందించారు. ైక్లెమాక్స్‌లో వచ్చే సందేశం అద్భుతంగా ఉంది. ఇలాంటి మంచి చిత్రాన్ని మనమంతా ఆదరించాలి’ అని చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

