Roja | అన్‌స్టాపబుల్ షోపై రోజా సంచలన వ్యాఖ్యలు..!
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ షోపై రోజా సంచలన వ్యాఖ్యలు చేసింది. విజయవాడ భవాని ఐలాండ్ లో జరిగిన సంక్రాంతి సంబురాల్లో రోజాను మీడియా ప్రతినిధులు అన్ స్టాపబుల్ షోకు వెళ్లే అవకాశం ఉందా అని ప్రశ్నించగా..
Roja Selvamani | నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ షోపై రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ భవాని ఐలాండ్ లో జరిగిన సంక్రాంతి సంబురాల్లో రోజాను మీడియా ప్రతినిధులు అన్ స్టాపబుల్ షోకు వెళ్లే అవకాశం ఉందా అని ప్రశ్నించగా.. చచ్చినా వెళ్లనని రోజా చెప్పారు. గతంలో అయితే అన్‌స్టాపబుల్ షోకి వెళ్లాలని ఆశగా ఉండేదని, ఎందుకంటే బాలకృష్ణతో కలసి ఏడు సినిమాలు చేశానని, బాలయ్యది తనది హిట్ కాంబినేషన్ అని చెప్పారు. అంతేకాకుండా తనను రెండు సార్లు ఈ షోకు పిలిచారని, కానీ కరెక్ట్‌గా వాళ్లు పిలిచిన టైమ్‌లో తనకు అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయని వెల్లడించారు. మొన్న బాలకృష్ణ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ చూశాక, జీవితంలో అన్‌స్టాపబుల్ షోకు పోకూడదని అనిపించిందని తెలిపారు. అయితే ఇప్పుడు పిలిచిన అస్సలు వెళ్లనని చెప్పుకొచ్చారు.
ఇక అన్‌స్టాపబుల్ రెండో సీజన్ డబుల్ సందడితో దూసుకుపోతుంది. కాగా మొదటి సీజన్లో కేవలం సినీ రంగానికి చెందిన ప్రముఖులే రాగా.. రెండో సీజన్లో మాత్రం రాజకీయ నాయకులు కూడా వస్తున్నారు. దాంతో ఈ రెండో సీజన్‌పై కాస్త విమర్శలు వస్తున్నాయి. ఇక త్వరలో స్ట్రీమింగ్ కానున్న పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ మీద రాజకీయంగా విమర్శలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇటీవలే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన గ్లింప్స్ రిలీజైంది. జనవరి చివరి వారంలో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

