Hari Hara Veera mallu | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “హరిహర వీరమల్లు” సినిమాను కాపాడాలని, టిక్కెట్లు కొని సినిమాను చూడాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ జనసేన ఎమ్మెల్యేలు, జన సైనికులకు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా విజ్ఞప్తి చేసినట్లు ఒక వీడియో ఆన్లైన్లో వైరల్‌గా మారింది. ఈ సినిమాకు ఫస్ట్ షో నుంచే మిక్స్డ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ప్రీమియర్స్‌లో వచ్చిన ఆదరణ ఆ తర్వాత కనిపించకుండా పోయింది. దీంతో ఈ సినిమాను ఎలాగైనా కాపాడండంటూ ఆన్లైన్లో నెటిజన్లు కూడా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా కాపాడాలని ఏకంగా జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పిన ఒక ఆడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఇందులో నాదెండ్ల మాట్లాడుతూ.. ప్రతి ఒక్క జనసేన కార్యకర్త “హరిహర వీరమల్లు” సినిమాను చూడాలని, డబ్బులు పెట్టి ఇతరులకు కూడా సినిమా చూపించాలని నాదెండ్ల కోరారు. అలాగే సినిమాకు పాజిటివ్ టాక్ రావడానికి కూటమిలోని ఇతర నేతల మద్దతు కూడా తీసుకోవాలని సూచించారు. డబ్బులు లేని ప్రజలకు జనసైనికులు డబ్బులు ఇచ్చి మరీ సినిమా చూపించాలని నాదెండ్ల మనోహర్ కోరారు. కాగా ఇందుకు సంబంధించిన ఆడియోను మీరు కూడా వినండి.
“హరిహర వీరమల్లు” సినిమాను హిట్ చేయాలని పవన్ కళ్యాణ్ స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ ఆదేశాలతోనే మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ సంయుక్తంగా ఈ టెలీ కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఇప్పటికే నాదెండ్ల మనోహర్ మూడుసార్లు జనసేన నేతలతో టెలీ కాన్ఫరెన్స్‌లు నిర్వహించడం విశేషం.
డబ్బులు పెట్టి టిక్కెట్లు కొనండి.. దయచేసి మన హీరో పవన్ కళ్యాణ్ సినిమాను కాపాడండి
టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జనసేన ఎమ్మెల్యేలకు, జన సైనికులను విజ్ఞప్తి చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్
సినిమా పాజిటివ్ టాక్ కోసం కూటమి నేతల మద్దతు కూడా తీసుకోవాలి
ప్రతి ఒక్క జనసేన కార్యకర్త హరిహర… pic.twitter.com/Hr9uhO8uSE
— Telugu Scribe (@TeluguScribe) July 26, 2025