యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం లైగర్(Liger). ఈ చిత్రాన్ని ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ గతంలో ఎప్పుడు చేయని విధంగా ఈ చిత్రంలో డ్యాన్స్ చేయనున్నాడట. ఈ సినిమాలో విజయ్ ఒక బాక్సర్‌గా కనిపించనున్నాడని ఫస్ట్ లుక్ ద్వారా స్పష్టమయింది.
లైగర్ సినిమాలో వరల్డ్ క్లాస్ బాక్సర్ మైక్ టైసన్(Mike Tyson) నటించనున్నాడని మూవీ టీమ్ ఒక పోస్టర్ ద్వారా స్పష్టం చేసింది. ఇందులో ఆయన ఎలాంటి పాత్రలో కనిపించనున్నాడన్న విషయాలు ఏమీ వెల్లడించకపోయినా ఈ అప్డేట్ మాత్రం ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేసింది. ఈ రోజు దీపావళి సందర్భంగా మైక్ టైసన్ లుక్ విడుదల చేస్తూ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసింది చిత్ర బృందం. ఈ పోస్టర్ లో మైక్ టైసన్.. చాలా భయంకరంగా కనిపిస్తున్నాడు. ఇక ఈ అప్ డేట్ తో విజయ్ దేవర కొండ ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం నెలకొంది.