ప్రస్తుతం మల్టీ స్టారర్స్ హంగామా నడుస్తుంది. స్టార్ హీరోలు సైతం మల్టీ స్టారర్స్‌పై ఆసక్తి చూపుతుండగా, క్రేజీప్రాజెక్ట్స్ రూపుదిద్దుకుంటున్నాయి. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చేసింది. నిర్మాణంలోదూసుకుపోతున్న ఏషియన్ నారంగ్ బర్త్ డే సందర్భంగా శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్.పి, ఏషియన్ సినిమాస్, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి సంయుక్తంగా నిర్మించే సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చింది.
మేఖేల్ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో విజయ్ సేతుపతి, సందీప్ కిషన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని తెలుగు,తమిళం,హిందీ,కన్నడ ,మలయాళంలో అత్యంత భారీగా విడుదల చేయనున్నారు.సింహాసనం కోసం పోటీ పడే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమాని రూపొందించనున్నారని తెలుస్తుంది. నారంగ్ ఇప్పటికే శేఖర్ కమ్ముల- ధనుష్ సినిమాని ప్రకటించారు. మద్రాస్ పాలన నేపథ్యంలో సాగే చిత్రమిదని సమాచారం.