Merry | ఇటీవలే జవాన్లో విలన్గా స్టన్నింగ్ యాక్టింగ్తో అదరగొట్టేశాడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi). తమిళంతోపాటు హిందీ, కన్నడ, మలయాళం, తెలుగు భాషల్లో ఓ వైపు హీరోగా.. మరోవైపు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తూ.. సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఈ హీరో. ఇక తాజాగా విజయ్ సేతుపతి నటిస్తున్న మరో బాలీవుడ్ చిత్రం మేరీ క్రిస్మస్. కత్రినా కైఫ్ కథనాయికగా నటిస్తుండగా.. బద్లాపూర్, అంధధూన్ సినిమాల ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాను మొదట డిసెంబర్ 15వ తేదీన విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విడుదల తేదీని మారుస్తూ కొత్త రిలీజ్ డేట్ను ప్రకటించారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీనితో పాటు ఒక కొత్త పోస్టర్ను కూడా మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. టిప్స్ ఫిలింస్, మ్యాచ్ బాక్స్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
KATRINA KAIF – VIJAY SETHUPATHI: ‘MERRY CHRISTMAS’ TO NOW ARRIVE ON 12 JAN 2024… 12 Jan 2024 is the new release date of #MerryChristmas, which teams #KatrinaKaif and #VijaySethupathi for the first time… #NewPosters…
“We have made this film with a lot of love and passion,… pic.twitter.com/LTOdtORsFK
— taran adarsh (@taran_adarsh) November 16, 2023