సాధారణంగా సెలబ్రిటీలంటే ఖరీదైన కార్లుంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోహీరోయిన్లు వారి వారి అభిరుచుల కు అనుగుణంగా కార్లను కొనుగోలు చేస్తుంటారు. టాలీవుడ్ యాక్టర్లలో లీడింగ్ యాక్టర్లు వాడే కార్లలో ముఖ్యమైంది మెర్సిడేస్. ఒక్కో సెలబ్రిటీ వారి రేంజ్ కు తగ్గట్టుగా డబ్బులు పెట్టి మెర్సిడేస్ కార్లను కొనుక్కొని వాడుకుంటున్నారు. వారిలో కొంతమంది గురించి తెలసుకుందాం.
మహేశ్‌బాబుకు రూ.88 లక్షలు విలువ చేసే మెర్సిడేస్ జీఎల్ెస్ 350డీ మోడల్ కారుంది. దీంతోపాటు మహేశ్ ఇతర లగ్జరీ కార్లను కూడా వినియోగిస్తుంటాడు. మరోవైపు మాస్ మహారాజా రవితేజ మెర్సిడేస్ ఎస్ క్లాస్ ను వాడుతుండగా..దీని ఖరీదు రూ.2.25 కోట్లు. ఇది ఇండియాలోనే మొట్టమొదటి బీఎస్-6మోడల్ అట.
మరోవైపు నాగచైతన్య మెర్సిడేస్ జీ63 ఏఎంజీని ఈ ఏడాది ఫిబ్రవరిలో కొనుగోలు చేశాడట. దీని ఖరీదు 2.3 కోట్లు. ఇక కార్లంటే పడి చచ్చిపోయే కన్నడ బ్యూటీ రష్మికకు మెర్సిడేస్ బెంజ్ సీ క్లాస్ కారు ఉంది. దీని ధర రూ.50 లక్షలు.వీరితోపాటు పలువురు సెలబ్రిటీలు కూడా ఈ బ్రాండ్ ను వినియోగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఉప్పెన డైరెక్టర్ తో తారక్..రెమ్యునరేషన్ హాట్ టాపిక్..!
విజయ్ సేతుపతి ‘విదుతలై’ ఫస్ట్ లుక్
పాపులర్ సాంగ్ వింటూ సారా ఏం చేసిందో తెలుసా..?
మనసా వినవా సాంగ్ లాంఛ్ చేసిన రాశీఖన్నా
రజనీకాంత్ అన్నాత్తే షూటింగ్‌కు కర్ఫ్యూ కష్టాలు…
రాయ్‌లక్ష్మీ, సోనాలీ స్టిల్స్ వైరల్
ఇస్మార్ట్ భామతో నితిన్ రొమాంటిక్ రైడ్ పోస్టర్