నాని హీరోగా తెరకెక్కిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ మెహ్రీన్. చూడచక్కని అందం ఆకట్టుకునే అభినయంతో వరుస ఆఫర్స్ అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగుతో పాటు హిందీ, తమిళంలో వరుస సినిమాలు చేస్తూ దూసుకెళుతున్న మెహ్రీన్ .. ఎఫ్ 3 చిత్రంతో పాటు పలు సినిమాలలో నటిస్తుంది. అయితే ఈ అమ్మడు ఇటీవల వరుస ఫొటోషూట్స్‌తో పిచ్చెక్కిస్తుంది.
మెహ్రీన్‌కు హర్యానా మాజీ సీఎం భజన్‌లాల్ మనవడు భవ్య బిష్ణోయ్‌తో పెళ్లి కుదిరిన విషయం తెలిసిందే. పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో మెహ్రీన్ తన పెళ్లి క్యాన్సిల్ అయిందని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే ప్రస్తుతం కెరియర్‌పై బాగా దృష్టిపెట్టిన మెహ్రీన్ శరీరాకృతి విషయంలో బాగా దృష్టి పెట్టింది. ఇటీవల ఈ అమ్మడు 10 కేజీల బరువు తగ్గినట్టు తెలుస్తుంది.
స్లిమ్‌గా మారిన తర్వాత మెహ్రీన్ వరుస ఫొటో షూట్స్ చేస్తూ ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిస్తుంది. తాజాగా కలర్ ఫుల్ డ్రెస్‌లో మెహ్రీన్ హోయలు పోతూ అందరి దృష్టి తనపై పడేలా చేసింది. స్లిమ్ లుక్‌లో ఇంత క్యూట్‌గా కనిపిస్తున్న మెహ్రీన్‌ని చూసి అభిమానులు, నెటిజన్స్ మైమరచిపోతున్నారు.