KGF Chapter-2 | ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ‘కేజీఎఫ్ చాప్టర్-2’ ఎలాంటి విధ్వంసాలను సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . సౌత్ నార్త్ అని తేడా లేకుండా విడుదలైన ప్రతి భాషలో వసూళ్ళ వర్షాన్ని కురిపిస్తుంది. ఇటీవలే ఈ చిత్రం 1100కోట్ల మార్క్‌ను అధిగమించి రికార్డు సృష్టించింది. ఇప్పటికే ఈ చిత్రం అన్ని భాషల్లో బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్లో ఈ చిత్రం సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. కలెక్షన్లలో ఖాన్, కపూర్లను సైతం వెనక్కి నెట్టి రాఖీ బాయ్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. చిత్రం విడుదలై 25రోజులు దాటిన కలెక్షన్లలో మాత్రం జోరు తగ్గడం లేదు. ఈ సినిమా ఇంద పెద్ద విజయం సాధించడంలో సంగీత దర్శకుడు రవి బస్రూర్ ముఖ్య పాత్ర వహించాడు. ఈయన కంపోజ్ చేసిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకి హైలెట్‌గా నిలిచాయి.
ఇటీవలే చిత్రం నుంచి విడుదలైన ‘ఎదగరా’ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ చిత్రంలోని మెలోడియస్ సాంగ్ అయిన ‘మెహబూబా’ వీడియో సాంగ్‌ను మంగళవారం ఉదయం 11గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. బిగెస్ట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే బాలీవుడ్లో 400కోట్ల క్లబ్లో అడుగుపెట్టింది. ‘బాహుబలి-2’ తర్వాత ఈ ఫీట్‌ను సాధించిన మొదటి సినిమాగా ‘కేజీఎఫ్-2’ రికార్డు సృష్టించింది. ఇలానే ఉంటే ఈ చిత్రం రూ.450కోట్లను కలెక్ట్ చేస్తుందనడంలో సందేహమే లేదు. యష్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలకపాత్రలో నటించాడు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై కిరగందూర్ నిర్మించాడు.