Student | రాజ్‌దూత్, కోతి కొమ్మచ్చి సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు దివంగత నటుడు, రియల్ స్టార్ శ్రీహరి కుమారుడు మేఘాంశ్ శ్రీహరి. లాంగ్ గ్యాప్ తర్వాత కొత్త సినిమాతో అప్డేట్తో హాయ్ చెప్పాడు. మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటిస్తోన్న చిత్రం స్టూడెంట్ (Student). బాలు తత్వమసి డైరెక్ట్ చేస్తున్నఈ మూవీ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో మేఘాంశ్ శ్రీహరి డ్రాయింగ్ లుక్ కనిపిస్తుండగా.. బ్యాక్ డ్రాప్లో పేపర్‌పై కొన్ని కొటేషన్లను గమనించవచ్చు.
ధైర్యం కలిగిన ఒక్క వ్యక్తి మెజారిటీ అవుతాడు.. మెంటల్ మాస్ తుఫాన్ రాబోతుందంటూ రిలీజ్ చేసిన లుక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమా హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
One man with courage makes a majority.”💥
Unveiling the FIRST LOOK of #Student starring @meghamshSrihari❤️🔥
A storm of MENTAL MASS is on the way! 🔥🕺🏻
Written and directed by @balu_Tatwamasi💥#StudentTheMovie@premchandkancha @srinivas_dp @nareshadupa @chittuprolu… pic.twitter.com/fXmOg3mTB5
— BA Raju’s Team (@baraju_SuperHit) June 23, 2026
Volcano eruption | అగ్నిపర్వతం నుంచి భారీ విస్ఫోటనం.. పరుగులు తీసిన పర్యాటకులు
Prabhas | 2027 ప్రభాస్ నామ సంవత్సరం.. ఒకటి కాదు మూడు భారీ ట్రీట్స్ ప్లాన్ చేస్తున్న రెబల్ స్టార్