నరేష్ ఆగస్త్య, రబియా ఖాతూన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మేఘాలు చెప్పిన ప్రేమకథ’. విపిన్ దర్శకుడు. ఉమాదేవి కోట నిర్మాత. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా సినిమాలోని ‘సౌండ్ ఆఫ్ లవ్’ అనే తొలి గీతాన్ని విడుదల చేశారు. జస్టిన్ ప్రభాకరన్ స్వరపరచిన ఈ పాటను రెహమాన్ రచించారు. సహజసిద్ధమైన శబ్దాలతో ఈ పాటను కంపోజ్ చేసిన విధానం ఆకట్టుకునేలా ఉంది.
‘ఒక మెరుపు మెరిసిందిపుడే చిరునవ్వుగా, ఒక చినుకు కురిసిందిపుడే సిరిమువ్వగా..’ అంటూ చక్కటి భావాలతో సాగిందీ గీతం. కవితాత్మకంగా సాగే ప్రేమకథా చిత్రమిదని, కథానుగుణంగా సంగీతానికి ప్రాధాన్యత ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. రాధికా శరత్‌కుమార్, తనికెళ్ల భరణి, వెంకటేష్ కాకుమాను, విద్యుల్లేఖ సుమన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, రచన-దర్శకత్వం: విపిన్.